News May 30, 2024

బాపట్ల: గల్లంతయిన నాలుగో వ్యక్తి మృతదేహం లభ్యం

image

మండలంలోని నాగరాజు కాలవలో బుధవారం గల్లంతు అయిన వారిలో నాలుగో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యం అయింది. మండలంలోని మూలపాలెం గ్రామం వద్ద కాలవలో నాలుగో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అధికారులు రెండు రోజులు పాటు కృషి చేసి 4 మృతదేహాలను వెలికి తీశారు.

Similar News

News April 25, 2025

మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: అంబటి

image

గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ అనూహ్య మలుపు తిరిగింది. పోటీలో వైసీపీ పోటీ చేయదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అంబటి రాంబాబు అభ్యర్థిని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు బృందావన్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2025

దేవతల నగరంగా అమరావతి ప్రసిద్ధి

image

నవ్యాంధ్ర రాజధాని అమరావతి చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల రాజధానిగా పేరు పొందింది. దేవతల నగరంగా ఖ్యాతి గాంచింది. బౌద్ధ మతం ఇక్కడ విలసిల్లింది. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నది పక్కనే ఉన్న అమరావతి ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. బౌద్ధ స్తూపం, మ్యూజియం, ధ్యాన బుద్ధ విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఇక్కడి అమరలింగేశ్వర దేవాలయం దేశంలోని పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పేరుంది.

News April 25, 2025

GNT: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కమిషనర్

image

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.సాయి కల్యాణ్ చక్రవర్తిని గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి వెళ్లి కమిషనర్ మొక్కను బహుకరించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధి పనుల్లో భాగంగా స్థలసేకరణలో ఇళ్లు కోల్పోయి కోర్టులో దాఖలైన కేసుల‌పై ఈ సందర్భంగా వారు చర్చించారు.

error: Content is protected !!