News March 9, 2025

బాపట్ల : చికెన్, మటన్ ధరలు ఇలా..!

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్‌ధరలకు డిమాండ్ పెరిగింది. గతవారంతో పోలిస్తే కేజీకి రూ.20-30 ధర పెరిగింది. పలు చోట్ల ఈ వారం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ. 180ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.800- 900లు ఉంది.  బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గడంతో చికెన్ ధరలలో రూ.30లకు పైగా ధర పెరిగింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 10, 2025

స్టార్ హీరో సినిమాలో నిధి అగర్వాల్?

image

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ హీరో సూర్య సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో ఆమెను తీసుకుంటారని సమాచారం. నిధితో పాటు మరో అప్‌కమింగ్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.

News March 10, 2025

రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్: షామా మహ్మద్

image

కెప్టెన్ రోహిత్ శర్మపై <<15636348>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ CT విజేత భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 76 పరుగులతో జట్టును ముందుండి నడిపిన హిట్ మ్యాన్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రేయస్, రాహుల్ కీలక ఇన్నింగ్సుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని కొనియాడారు.

News March 10, 2025

KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

image

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.

error: Content is protected !!