News April 9, 2025
బాపట్ల జిల్లా DCHS బాధ్యతల స్వీకరణ

బాపట్ల జిల్లా హాస్పిటల్స్ కోఆర్డినేటర్‌గా మోజేష్ కుమార్ నియమితులయ్యారు. బుధవారం బాపట్ల జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో DCHSగా పనిచేసిన శేషు కుమార్ కృష్ణాజిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన డీసీహెచ్‌గా మోజేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
Similar News
News April 19, 2025
రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.
News April 19, 2025
మేలో మరో ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

మే నెల 22వ తేదీన ‘GSLV F-16’ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఓదెల 41.5℃ నమోదు కాగా అంతర్గం 41.3, సుల్తానాబాద్ 40.7, పాలకుర్తి 40.6, పెద్దపల్లి 40.6, రామగుండం 40.1, ఎలిగేడు 40.0, జూలపల్లి 39.7, కమాన్పూర్ 39.6, రామగిరి 39.5, మంథని 39.3, ధర్మారం 39.3, కాల్వ శ్రీరాంపూర్ 39.2, ముత్తారం 39.8℃ గా నమోదయ్యాయి.