News March 16, 2025
బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

◆బాపట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు◆మార్టూరు: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం◆బాపట్ల: పరిసరాలను శుభ్రం చేసిన అడిషనల్ ఎస్పీ◆చీరాల: రైళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్టు◆బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్◆వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి◆పర్చూరు మండలాన్ని కమ్మేసిన పొగ మంచు◆రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి
Similar News
News March 16, 2025
వరంగల్‌లో కిలాడి లేడీ అరాచకాలు

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేసి వారిని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత వారిపై అత్యాచారాలు చేయించి, స్పృహలో రాగానే ఎక్కడ కిడ్నాప్ చేశారో.. అక్కడ వదిలి వెళ్తున్నారు. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ విషయం బయటపడింది. ఆ కిలాడీకి మరో నలుగురు యువకులు సహాయపడుతున్నట్లు తెలుస్తోంది. వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
News March 16, 2025
అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
News March 16, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మంథని 40.8℃ నమోదు కాగా రామగిరి 40.6, పాలకుర్తి 40.5, అంతర్గం 40.4, కమాన్పూర్ 40.3, సుల్తానాబాద్ 40.2, ఓదెల 40.1, ముత్తారం 39.7, కాల్వ శ్రీరాం 39.5, రామగుండం 39.4, పెద్దపల్లి 39.3, ధర్మారం 38.4, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.3℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.