News March 24, 2025
బాపట్ల జిల్లా TODAY TOP HEADLINES

◆ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్◆క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ◆బాపట్ల: పోలీస్ గ్రీవెన్స్ కు 48 ఫిర్యాదులు◆దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష◆బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు◆వేటపాలెం: టీడీపీలో చేరిన కాంగ్రెస్ కుటుంబాలు
Similar News
News March 31, 2025
ఆమె నాలుక ఎంత పొడవో…

నాలుకతో ముక్కును అందుకోవడానికే మనం నానాపాట్లు పడుతుంటాం. కానీ ఆ మహిళ నాలుకతో ముఖం మొత్తాన్ని చుట్టేస్తోంది. ఆమే కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదివే చానల్ టాపర్(34). ఈ మహిళ నాలుక పైపెదవి నుంచి కొన వరకు ఏకంగా 3.78 అంగుళాలు(9.75cm) ఉంది. దీంతో ‘లాంగెస్ట్ టంగ్ ఇన్ ది వరల్డ్’గా గిన్నిస్ బుక్‌లో చోటుదక్కించుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో ‘హలోవీన్’ ఫొటో సెషన్ సందర్భంగా తనలోని ఈ లక్షణాన్ని టాపర్ గుర్తించారు.
News March 31, 2025
కర్నూలు: రూ.71.47 కోట్ల పన్నులు వసూలు

నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే కర్నూలు నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. స్పందించిన బకాయిదారులు అత్యధిక సంఖ్యలో పన్నులు చెల్లించినందుకు నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయేలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు కేఎంసీ కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.71.47 కోట్లు పన్ను రూపంలో వసూలు అయినట్లు తెలిపారు.
News March 31, 2025
నిర్మల్ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.