News March 15, 2025
బాపట్ల జిల్లా కలెక్టర్ సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమం శనివారం సూర్యలంక బీచ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొంటున్నట్లు కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Similar News
News March 15, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.14,57,210 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.6,22,558, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.6,77,850, అన్నదానానికి రూ.1,56,802 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News March 15, 2025
WPL: ఫైనల్ విజేత ఎవరో?

నేడు WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఉవ్విళ్లూరుతున్నాయి. ఆల్‌రౌండర్లు నాట్ సీవర్, హేలీ మాథ్యూస్‌లతో ముంబై టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ముంబైపై ఢిల్లీదే ఆధిపత్యం. కాగా మ్యాచ్ రా.8.00 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లలో లైవ్ చూడవచ్చు.
News March 15, 2025
మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.