News February 9, 2025

బాపట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

బాపట్ల జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న బాపట్ల జిల్లాలో గరిష్ఠంగా 33.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News February 10, 2025

కందుకూరు: ఉచితంగా రూ.45 వేల ఇంజెక్షన్

image

గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.

News February 10, 2025

బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: కలెక్టర్

image

పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అధ్యక్షతన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల రక్షణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. 

News February 10, 2025

బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి

image

తనని కడప జైల్‌లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్‌లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం

error: Content is protected !!