News February 23, 2025

బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.

Similar News

News February 23, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ➤ ఆదోనిలో ఘోరం.. బాలుడిపైకి దూసుకెళ్లిన లారీ ➤ మంత్రాలయం శ్రీ మఠంలో ఆకట్టుకున్న భరతనాట్యం ➤ ఎమ్మిగనూరు ఎస్ఎంఎల్ కాలేజీలో 25న జాబ్ మేళా ➤ జిల్లాలో చికెన్‌కు తగ్గిన డిమాండ్ ➤ రూ.1.15 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం ➤ జిల్లాలోని ఆలయాల్లో మొదలైన మహా శివరాత్రి సందడి

News February 23, 2025

నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

☞ శ్రీశైలానికి ఎంపీ శబరి పాదయాత్ర
☞ గడివేముల మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
☞ నెల్లూరు జిల్లాలో మంత్రి బీసీ పర్యటన
☞నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి: బొజ్జా
☞ చెంచు మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ
☞ శ్రీశైలంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
☞ ప్రొద్దుటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఆళ్లగడ్డ డ్రైవర్ మృతి
☞ ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు: కర్నూలు కలెక్టర్

News February 23, 2025

జిల్లాలో గ్రూప్‌-2 మెయిన్స్ ప్ర‌శాంతం : కలెక్టర్

image

ఎన్టీఆర్ జిలాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్షలు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లోని 19 కేంద్రాల్లో 8,792 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయ‌గా.. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 83.89 శాతం (7,376), మ‌ధ్యాహ్నం పేప‌ర్‌-2కు 83.62 శాతం (7,352) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు.

error: Content is protected !!