News February 21, 2025

బాపట్ల: ‘పరీక్షలను సజావుగా నిర్వహించాలి’ 

image

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, పి 4 సర్వే, ఎం.ఎస్.ఎం.ఇ సర్వే, వాట్సాప్ గవర్నెన్స్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా వెంకట మురళీ పాల్గొన్నారు.

Similar News

News February 22, 2025

మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

image

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.

News February 22, 2025

BREAKING: బాలుడు అర్ణవ్ కన్నుమూత

image

TG: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News February 22, 2025

విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: భట్టి

image

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

error: Content is protected !!