News March 22, 2025

బాపట్ల: పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్.!

image

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాపట్ల ఎస్కార్ట్ పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని చెరుకుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జైలు నుంచి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్‌లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో కొత్తపేటలో ఫిర్యాదు చేశారు.

Similar News

News March 23, 2025

కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

image

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.

News March 23, 2025

ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే: పాటీదార్

image

IPL 2025 సీజన్‌లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.

News March 23, 2025

ఫిలింనగర్‌: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

image

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

error: Content is protected !!