News March 19, 2025

బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

image

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 21, 2025

తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

image

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.

News March 21, 2025

ఉగాది నుంచి సన్నబియ్యం: మంత్రి పొంగులేటి

image

ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈరోజు పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.

News March 21, 2025

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

image

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్‌పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.

error: Content is protected !!