News April 24, 2025

బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

image

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

Similar News

News April 25, 2025

వందేళ్ల పండగకు రెఢీ అవుతున్న ఏయూ 

image

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రో.రాజశేఖర్ తెలిపారు. తొలిరోజు ఉదయం 6గంటలకు ఆర్కే బీచ్‌లో శతాబ్ది వాక్ థాన్ ప్రారంభంకానుందని అన్నారు. ఉ.9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మ.3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ హాజరవుతారన్నారు.

News April 25, 2025

తండ్రి మందలించాడని యువతి ఆత్మహత్య

image

తండ్రి మందలించాడని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన వాణి (20) అనంతపురంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆ ఎగ్జామ్స్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 25, 2025

రాజమండ్రి : ‘ప్రేమించి.. ఇప్పుడు వద్దంటున్నాడు’

image

విజయనగరానికి చెందిన యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడంటూ రాజమండ్రి యువతి పోలీసులను ఆశ్రయించింది. RJY దేవీచౌక్ సమీపంలోని ఓ కోచింగ్ సెంటర్లో రాంబాబు కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు. అదే కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతి (20)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. శారీరంగా లోబర్చుకుని పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో అవమానించాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.

error: Content is protected !!