News April 20, 2025

బాపట్ల: రేపు చీరాలలో ప్రజా వేదిక- కలెక్టర్

image

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 20, 2025

మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా: వైసీపీ

image

AP: మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ Xలో విమర్శించింది. ఇది మెగా డీఎస్సీ కాదు మెగా డిసప్పాయింట్‌మెంట్ అని మండిపడింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తారనే విషయమై స్పష్టత లేదని విమర్శించింది. ఈ మెగా డ్రామా పూర్తిగా పబ్లిక్ స్టంట్ అని దుయ్యబట్టింది.

News April 20, 2025

ఉరవకొండ: తమ్ముడి పెళ్లి చూపులకు వెళ్తుండగా విషాదం

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

News April 20, 2025

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ.. 

image

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!