News April 24, 2025
బాపట్లలో రేపు ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్

ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ప్రతినెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గురువారం పేర్కొన్నారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలో దివ్యాంగులు, ఎస్టీలు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు రావచ్చన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎస్టీలు, దివ్యాంగులు గమనించాలని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News April 25, 2025
ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
News April 25, 2025
మరిపెడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని పూల బజార్‌కు చెందిన వంశీ(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కాలువ ఒడ్డు ప్రాంతంలో బైక్, ఆటో ఢీ కొనడంతో వంశీ మృతి చెందాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శుక్రవారం ఉదయం మరిపెడలో అంత్యక్రియలు జరగనున్నాయి.
News April 25, 2025
నర్సాపూర్(జి): విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండలంలో జరిగింది. SI సాయికిరణ్ కథనం ప్రకారం.. డొంగర్గాంక చెందిన విజయ్(51) ఈనెల 11న జంగిపిల్లి చిన్నయ్య పొలంలో మోటర్ పనిచేయకపోవడంతో మోటర్ పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లగా HYDలో చికిత్స అందించారు. బుధవారం ఇంటికి తీసుకురాగా.. గురువారం మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.