News January 17, 2025

బాలయ్య అభిమానులకు షాక్‌ ఇచ్చిన తిరుపతి పోలీసులు

image

డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా పొట్టేలును బలిచ్చిన ఐదుగురు బాలకృష్ణ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. SI బాలకృష్ణ వివరాల ప్రకారం.. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఐదుగురు బాలకృష్ణ అభిమానులు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ ఎదుట ఈనెల 12న పొట్టేలును బలిచ్చి ఆ రక్తం సినిమా పోస్టర్‌కు అంటించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Similar News

News January 17, 2025

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్‌ నెల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్‌ నెల కోటాను జ‌న‌వ‌రి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం జ‌న‌వ‌రి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జ‌న‌వ‌రి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.

News January 17, 2025

సదుం: చిన్నారుల మృతికి కారణమైన తల్లి అరెస్ట్

image

చిన్నారులతో పాటు ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి.. వారి మృతికి కారకురాలైన తల్లిని అరెస్టు చేసినట్లు సీఐ రాంభూపాల్ మంగళవారం తెలిపారు. సదుం మండల కేంద్రానికి చెందిన కరిష్మా ఈనెల 12న తన ఇద్దరు చిన్నారులతోపాటు కరెంటు వైర్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.

News January 17, 2025

20 నుంచి తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం 20వ తేదీ నుంచి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అదేవిధంగా ప్రోటోకాల్ మినహా 20న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.