News February 21, 2025

బాలానగర్: సీసీ కెమెరాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

image

బాలానగర్ సీఐ నర్సింహా రాజు నేతృత్వంలో ఇటీవల సీసీటీవీల ప్రాముఖ్యత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ పరధిలోని ఆదర్శ్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను శుక్రవారం సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి, బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్, బాలానగర్ ఏసీపీ హనుమంతా రావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు నేర నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

Similar News

News February 22, 2025

విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

image

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

News February 22, 2025

నూజివీడు: తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య

image

నూజివీడు పట్టణ పరిధిలోని బాపునగర్ రోడ్డులో గల పాలిటెక్నిక్ విద్యార్థిని బట్ర వెంకట రమ్య (18) శనివారం ఇంటిలోని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకొని రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలేజీకి వెళ్లలేదని తల్లి మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.

News February 22, 2025

వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

image

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.

error: Content is protected !!