News February 3, 2025
బాలిక ఇంటి ఎదుట యువకుడి హల్చల్
పెనుబల్లి మండల కేంద్రంలో మహేందర్ సాయి అనే యువకుడు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. స్థానికుల వివరాలు… తనను ప్రేమించాలంటూ ఓ మైనర్ బాలిక ఇంటి ఎదుట హల్చల్ చేశాడు. కాసేపటి తరువాత స్థానికులను దూషించగా వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కొంతకాలంగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
Similar News
News February 3, 2025
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్.. ఎందుకు?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. క్యాడర్‌కు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుబాటులో ఉండడం లేదని టాక్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక లోకల్ లీడర్స్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
News February 3, 2025
తల్లాడలో ఆకట్టుకుంటున్న ఫ్లెక్సీ
రైతుకష్టపడితేనే.. అందరికీ పంచభక్ష్యం.. అని రాసివున్న రాజకీయ ఫ్లెక్సీ రైతులు, వాహనాదారులను ఆకట్టుకుంటోంది. తల్లాడ మండలం అంజనాపురం సమీపంలో రైతు నలజాల శ్రీనివాసరావు తన మొక్కజొన్న పంటలో రాజకీయ నాయకుల ఫోటోలతో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో రైతు కష్టం చెబుతూనే తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది.
News February 3, 2025
ఖమ్మం: స్వల్పంగా పెరిగిన కొత్త మిర్చి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్ లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.