News April 24, 2025
బాలికను రక్షించిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.
Similar News
News August 23, 2025
VZM: స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయండి

విజయనగరం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పిసిపిఎన్‌డిటి చట్టం అమలుపై తమ ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల రెన్యువల్, కొత్త వాటికి అనుమతులపై చర్చించారు. అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకూడదన్నారు.
News August 22, 2025
VZM: గుంటూరు పార్లమెంట్ పరిశీలకునిగా కిమిడి నాగార్జున

పార్లమెంటు అధ్యక్షుల నియామకంలో భాగంగా తనను గుంటూరు పార్లమెంట్ స్థానానికి పరిశీలకులుగా నియమించినట్లు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక విడుదల చేశారు. తనపై నమ్మకం పెట్టి పరిశీలకునిగా నియమించినందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో నాగార్జునకి పలువురు అభినందనలు తెలిపారు.
News August 22, 2025
VZM: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

విజయనగరం జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడి నంత స్టాక్ సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉన్నవివిధ పంటలకు గాను 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 25,605 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. 3వేల టన్నుల యూరియా అవసరం ఉంటుందన్నారు.