News March 19, 2025
బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

హనుమకొండ జిల్లా భీమారం పలివేల్పుల రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైనింగ్ హాల్, వాష్ ఏరియాను పరిశీలించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సుభాషిణిని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 20, 2025
మంచిర్యాల: ఆ ఉపాధ్యాయుడే కీచకుడు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. మంచిర్యాల గర్ల్స్ హై స్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
News March 20, 2025
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

కర్లపాలెం మండలం యాజలికి చెందిన ప్రవీణ్ కుమార్(15) ఈతకు వెళ్లి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాజలిలోని పంట పొలాల్లో 20 అడుగుల లోతు ఉన్న ఓ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఘటనలో పిట్టలవానిపాలెం మండలం గోకరాజునల్లి బోయినవారిపాలెంలో విద్యుత్ షాక్ తగిలి కలుసు బేబీ(6) అనే బాలిక మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
News March 20, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 38.9°C నమోదు కాగా, జమ్మికుంట 38.7, చిగురుమామిడి 38.2, శంకరపట్నం 38.0, కరీంనగర్ రూరల్ 37.9, గన్నేరువరం 37.7, మానకొండూర్ 37.6, తిమ్మాపూర్ 37.3, వీణవంక 37.2, రామడుగు 37.0, కరీంనగర్ 36.7, కొత్తపల్లి 36.0, హుజూరాబాద్ 35.5, ఇల్లందకుంట 35.4, చొప్పదండి 35.0, సైదాపూర్ 34.6°C గా నమోదైంది.