News February 8, 2025

బాసర ట్రిపుల్ ఐటీలో తప్పులపై అధ్యాయన కమిటీ

image

బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షా పత్రాల మూల్యంకనం ప్రక్రియపై నిజ నిర్ధారణ కమిటీ నియమించినట్లు యూనివర్సిటీ పరిపాలన అధికారి రణధీర్ తెలిపారు. మూల్యంకనంలో పొరపాట్లతో పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారిని విద్యార్థులు నిలదీసి నిరసన తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కమిటీ వేసినట్లు అధికారులు వివరించారు.

Similar News

News February 8, 2025

NGKL: యువకుడి ఆత్మహత్య

image

తాను ప్రేమించిన యువతి ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. NGKL మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు (23) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News February 8, 2025

నర్సీపట్నంలో అల్లూరికి చెందిన ఫారెస్ట్ ఉద్యోగి మృతి

image

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడి పుట్టన్న అనే ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందిన విషయం తెలిసిందే. నర్సీపట్నం కూడలిలో బైక్‌పై వెళ్తుండగా హ్యాండీల్ అటుగా వెళ్తున్న బస్సుకు తగలడంతో ఈ ఘటన జరిగింది. దీనిపై టౌన్ సీఐ గోవిందరావు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ మర్రిపాకల రేంజ్‌లోని పలకజీడి సెక్షన్ అధికారిగా పని చేస్తున్నారు.

News February 8, 2025

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

image

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

error: Content is protected !!