News February 2, 2025

బాసరకు పోటెత్తిన భక్తులు

image

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే వసంత పంచమి వేడుకలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సాధారణ సెలవు దినం కావడం ఉత్సవాల ప్రత్యేక దినం కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి ఆదివారం అక్షర శ్రీకర పూజలు ప్రారంభిస్తున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ఆలయంలో మూడు మండపాల్లో పూజలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2025

రాజకీయాల్లోకి ధోనీ? బీసీసీఐ VP ఏమన్నారంటే?

image

భారత మాజీ కెప్టెన్ ధోనీ మంచి రాజకీయ నేత కాగలరని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. వస్తే మాత్రం గెలుస్తారు. ఎందుకంటే ధోనీకి పాపులారిటీ ఎక్కువ. MPగా పోటీ చేస్తున్నావని విన్నాను.. నిజమేనా? అని ఒకసారి అడిగితే పోటీ చేయట్లేదని చెప్పారు. ఆయన ఫేమ్‌కి దూరంగా ఉండాలనుకుంటారు. మొబైల్ ఫోన్ కూడా వాడరు’ అని చెప్పారు.

News February 2, 2025

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతదేహం

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వ్యక్తి ఫొటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 2, 2025

ఇందల్వాయి: కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి

image

ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో కంటైనర్ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు (32) ఆదివారం తన బైక్ పై కామారెడ్డి వైపు నుంచి నిజామాబాద్ వెళ్తుండగా చంద్రాయన్పల్లి వద్ద సర్వీస్ రోడ్డు పనులు జరుగుతుండంతో రోడ్డు పక్కన అడ్డంగా పెట్టిన మట్టి బ్యాగులు ఢీకొని నాగరాజు కింద పడ్డాడు. ఆయనపై నుంచి కంటైనర్ వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.