News February 7, 2025
బిక్కనూర్: ప్రమాదాల నివారణకు చర్యలు: అడిషనల్ ఎస్పీ
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆమె పలు సలహాలు, సూచనలు చేశారు. ఆమె వెంట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Similar News
News February 8, 2025
హసీనా వ్యాఖ్యలతో భారత్‌కు సంబంధం లేదు: విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని భారత్‌లో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమె వ్యాఖ్యలతో ఇండియాకు సంబంధం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ స్పష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తాము ఎప్పుడూ కృషి చేస్తామన్నారు. బంగ్లా అంతర్గత వ్యవహారాలను INDకు ముడిపెట్టడం సరికాదని ఆ దేశ అధికారులకు తేల్చిచెప్పారు.
News February 8, 2025
సంగారెడ్డి: నేడు పాఠశాలలకు పని దినం: డీఈవో
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యంకు సంబంధించిన పాఠశాలలు రేపు పని చేస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, రేపు పాఠశాలల యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల హెచ్ఎమ్‌లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News February 8, 2025
మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.