News March 14, 2025
బిక్కనూర్: రేపటి నుంచి సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని ఉన్న దక్షిణ కాశీగా, పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
Similar News
News March 14, 2025
ఈ ఐదు రోజులు జాగ్రత్త!

TG: వేసవి వచ్చేసింది. అసలే ఓవైపు ఎండలు దంచికొడుతుంటే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19 వరకు వేడిమి మరీ ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఆరుబయట పని చేసే రైతాంగం చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. అయితే ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్వల్ప ఉపశమనం లభిస్తుందని, ఆ 5 రోజుల పాటు స్వల్ప వర్షపాతం ఉంటుందని తెలిపారు.
News March 14, 2025
రేపు అహోబిలానికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ రాక

ఏపీ చీఫ్ సెక్రటరీ కే.విజయనంద్ శనివారం అహోబిలం క్షేత్రానికి రానున్నట్లు మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ రాజకుమారి రానున్నట్లు తెలిపారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ రాక సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ తెలిపారు.
News March 14, 2025
నా కంటే మా అన్నయ్యలను నాన్న ఎక్కువ కొట్టేవారు: పవన్

AP: సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్లమందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఓ రోజు సెకండ్ షోకు వెళ్లొచ్చేసరికి మా నాన్న కోపంతో ఉన్నారు. ఆయన కొడతారని భయపడ్డా. కానీ నేను హీరోనని, 4 సినిమాలు హిట్లయ్యాయని చెప్పా. ఇంకా ఎక్కువ తిట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే నా కంటే మా అన్నయ్యలను ఆయన ఎక్కువ కొట్టేవారు’ అని చెప్పుకొచ్చారు.