News February 28, 2025
బిక్కనూర్: వసతి గృహంలో కలెక్టర్ బస

బిక్కనూర్ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో అందుతున్న సేవలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, విద్యార్థులతో కలిసి బస చేశారు.
Similar News
News December 13, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాలీలు, గుంపులపై నిషేధం: ఎస్పీ

నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడకూడదని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో BNSS 163 అమలులో ఉన్నందున, విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా, డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
News December 13, 2025
‘రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించవలసిన బాధ్యత మనదే’

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ.. మార్కెటింగ్ సదుపాయాలు చూపించవలసిన బాధ్యత కమిటీ ఛైర్మన్‌లపై ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌లు, డైరెక్టర్ల అవగాహన సదస్సు విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 9 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు మార్కెటింగ్ అంటే ఏంటో ఆమె సమగ్రంగా వివరించారు.
News December 13, 2025
SKLM జిల్లాలో 6,508 కేసులు పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6,508 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా శనివారం పేర్కొన్నారు. దీనిలో సివిల్ కేసులు 202కు రూ.4,54,96,124లు, క్రిమినల్ కేసులు 625కు రూ.52,54,522లు, ఫ్రీ లిటిగేషన్ కేసులు 53కు రూ.20,38,931లతో రాజీ అయ్యాయని వెల్లడించారు. HMPO కేసులలో భార్యాభర్త కలుసుకోవడంతో న్యాయమూర్తులు ఆనందం వ్యక్తం చేశారన్నారు.


