News February 18, 2025

బిచ్కుంద : పిగ్ మీ పేరిట ఘరానా మోసం

image

బిచ్కుంద మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో తాత్కాలికంగా దరఖాస్తులు రాసుకుంటూ ఉపాధి పొందుతున్న జంగం రాజు అనే వ్యక్తి ఖాతాదారులను పిగ్ మీ పేరిట భారీగా డిపాజిట్ల సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీయగా తమకు సంబంధం లేదని తేల్చేశారు. మోసం చేసిన వ్యక్తి కుటుంబంతో సహా పరారైయ్యాడు. రూ.60 లక్షలు స్వాహా చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు.

Similar News

News December 15, 2025

MBNR: SGF U-19 హ్యాండ్ బాల్ పోటీలు.. విజేతలు వీరే!

image

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎస్జీఎఫ్ U- 19 హ్యాండ్ బాల్ ఎంపికలు ముగిశాయి.
✔ బాలికల విభాగంలో
✒1st ప్లేస్- మహబూబ్ నగర్
✒2nd ప్లేస్- వరంగల్
✒3rd ప్లేస్- కరీంనగర్
✔ బాలుర విభాగంలో
✒1st ప్లేస్- మహబూబ్ నగర్
✒2nd ప్లేస్- వరంగల్
✒3rd ప్లేస్- ఖమ్మం
గెలుపొందిన జట్లను పలువురు అభినందించారు. స్థానిక నేతలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

News December 15, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 15, 2025

WGL: కాంగ్రెస్ 545, BRS 336, BJPకి 29 జీపీలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. మొదటి, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 545 పంచాయతీలకు గెలువగా, బీఆర్ఎస్ 336, బీజేపీ 29, ఇతరులు 98 పంచాయతీలను గెలుచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి బీజేపీ 29 జీపీలను గెలిచి తన ఖాతాను తెరవగా, మిగిలిన 3వ దశపై మూడు పార్టీలు గురి పెట్టాయి. బీఆర్ఎస్ రెండో విడతలో కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది.