News April 17, 2025

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి: మాజీ మంత్రి

image

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

బీబీపేట్: పురుగు మందు తాగి సూసైడ్

image

బీబీపేట్ మండలం ఇస్సానగర్‌కు చెందిన ధర్మగారి రాజాగౌడ్(34) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య శైలజతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బీబీపేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

News January 20, 2026

NTR: జోగి రమేశ్‌కి బెయిల్ మంజూరు

image

నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి జోగి రమేశ్‌కు ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ములకల చెరువు కేసులో జోగి సోదులకు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ కొనసాగుతోంది.

News January 20, 2026

SKLM: స్వర్ణంతో బియ్యపు గింజంత రథసప్తమి లోగో

image

రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయించే సూర్యుడుని స్వర్ణంపై ఆవిష్కరించారు పలాస (M) కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి. రథసప్తమి అనే అక్షరాలను ఇందులో పొందిపరిచి ఆకట్టుకుంటున్నారు. ఈ లోగోను ఆదిత్యునికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోగో 100 మిల్లీ గ్రాముల బంగారం రేకుపై 5 గంటలు శ్రమించి తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.