News March 29, 2024

బీఆర్ఎస్‌కు కడియం ఫ్యామిలీ ఝలక్!

image

కడియం ఫ్యామిలీ బీఆర్ఎస్‌కి ఝలక్ ఇచ్చారు. 6 నెలల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని ఆరోపించిన కడియం శ్రీహరి నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరుతుండటంతో నియోజకవర్గంలో కారు ఢీలా పడినట్లే అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే 3 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కడియం కావ్య.. ఒక్కసారిగా తన మనసు మార్చుకుని కారు గుర్తుపై కూడా పోటీ చేయనంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.

Similar News

News January 12, 2025

ఉమ్మడి వరంగల్ క్రైం న్యూస్

image

> JN: తీగారంలో గంటల వ్యవధిలో దంపతుల మృతి> > ఇంటర్ విద్యార్థిని సూసైడ్> సూసైడ్ > షాక్ తో కాడేడ్లు మృతి > WGL: > బెట్టింగ్.. ఆన్లైన్ సూసైడ్> NSPT: చిన్నారిపై పిచ్చికుక్క దాడి> JN: ఇసుక అక్రమ > కేసు నమోదు> MHBD: పూసల తండా శివారులో > నల్లబెల్లం పట్టివేత> WGL: గుట్కా విక్రయం.. అరెస్టు >

News January 11, 2025

పాలకుర్తి: గంటల వ్యవధిలో దంపతుల మృతి

image

గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన బైకాని సోమక్క శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. భార్య మరణ వార్త తెలుసుకొని షాక్‌కు గురైన భర్త కొమురయ్య సైతం ఈరోజు ఉదయం చనిపోయారు. గంటల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

News January 11, 2025

వరంగల్: నకిలీ వైద్యులున్నారు.. పారా హుషార్..!

image

ఉమ్మడి WGL జిల్లాలో నకిలీ డాక్టర్ల వైద్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. NSPTలో పిల్లలు పుట్టేందుకు నకిలీ వైద్యుడి ట్రీట్మెంట్‌తో  ఓ మహిళ అస్వస్థతకు గురికాగా స్థానికులు పట్టుకున్నారు. ఇలానే.. WDPTలో ఒక ఆటో కార్మికుడు, WGLలో ఆపరేషన్ చేస్తూ ఒకరు, CHPTలో హెర్బల్ మందుల పేరుతో మహిళ మృతి చెందిన ఘటనలు జరిగాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో సుమారు 60కి పైగా నకిలీలను గుర్తించారు.