News March 17, 2025

బీబీనగర్: అర్ధరాత్రి చోరీ.. బైక్‌పై దొంగలు!

image

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారంలో ఆదివారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండగా సీసీ కెమెరాలలో రికార్డైంది. బీబీనగర్ పెట్రోలింగ్ పోలీసులు దొంగలు చొరబడిన ఇళ్లను పరిశీలించారు. బాధితులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 17, 2025

ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

image

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News March 17, 2025

రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.

News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.

error: Content is protected !!