News March 25, 2025
బీబీనగర్: ఆ గ్రామంలో దొంగల భయం

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమారం గ్రామంలో వారం రోజులుగా రాత్రి పూట నిత్యం ఏదో ఒక చోట దొంగలు చోరీకి ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు దొంగలు ఓ ఇంట్లో చొరబడే సమయానికి ఇంట్లో వారు నిద్రలేచి అరవడంతో పారిపోయినట్లు చెప్పారు. యువకులు దొంగల వెంటపడ్డా దొరకలేదన్నారు. పోలీసులు తమ గ్రామాన్ని దొంగల బారి నుంచి కాపాడాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.
Similar News
News March 29, 2025
రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం శనివారం నంద్యాల(D) రుద్రవరంలో రాష్ట్రంలోనే 43.5°C, కర్నూలు(D) ఉలిందకొండలో 42.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, గత కొద్దిరోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.
News March 29, 2025
టాస్ గెలిచిన ముంబై

IPL: GTతో మ్యాచులో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్(C), నమన్ ధీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, ముజీబ్, సత్యనారాయణ రాజు.
GT: గిల్(C), బట్లర్, సాయి సుదర్శన్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి కిశోర్, రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
News March 29, 2025
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను అభివృద్ది చేయాలి: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాల నిర్వహణ విషయంలో హేతుబద్ధీకరణ కలిగి ఉండాలని, మౌలిక వసతులకు సంబంధించిన పనులు నిర్ణిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను హేతుబద్ధీకరణ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు.