News February 13, 2025
బీర్ల ధరపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739369154172_20397864-normal-WIFI.webp)
బీరుకు 30 నుంచి 40 రూపాయలు ధర పెంచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితేనే గగ్గోలు పెట్టారని వాపోయారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమని, నాణ్యతలేని బీర్లు తీసుకొస్తున్నారని అన్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడూ సమాధానం చెప్పాలన్నారు.
Similar News
News February 13, 2025
నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739427115989_774-normal-WIFI.webp)
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
News February 13, 2025
NGKL: విద్యుత్ టవర్‌కు ఉరేసుకున్నాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739419987105_774-normal-WIFI.webp)
మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తిమ్మాజిపేట మం. కోడుపర్తికి చెందిన సురేశ్(21) తల్లి పేరుపై ఉన్న భూమిని పదేళ్ల కింద గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి పట్టా చేసుకున్నాడు. తమకు ఇస్తానన్న భూమి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో సురేశ్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ నిన్న ఇంట్లోంచి వెళ్లి పొలం వద్ద విద్యుత్ స్తంభానికి ఉరేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News February 13, 2025
అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739414533476_774-normal-WIFI.webp)
అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్‌పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.