News March 15, 2025

బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల ప్రవేశానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు ఉండగా, ఫీజు రూ.150 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బోనఫైడ్, ఆధార్, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఫొటో, సంతకం, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News March 15, 2025

మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

image

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్‌లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 15, 2025

గ్రూప్-3లో 24 ర్యాంక్ సాధించిన జిల్లా వాసి

image

ఆర్మూర్ పట్టణానికి చెందిన దొంద రామ్ కిషోర్ గ్రూప్-3 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. 317 మార్కులతో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంక్ సాధించారు. ఇటీవల ఆయన గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిజామాబాద్‌లో కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News March 15, 2025

రంప : పడిపోయిన టమాటా ధర

image

ఆరుగాలాలు కష్టపడి పంట పండించిన రైతుకు తన కష్టానికి తగిన మద్దతు ధర కూడా రాని పరిస్థితి నేడు నెలకొంది. అల్లూరి జిల్లాలో టమాటా రేటు బాగా పడిపోయింది. రంపచోడవరం పరిసర గ్రామాల్లో శనివారం హోల్ సేల్ మార్కెట్లో 10 కిలోలు టమాటా రూ. 100 పలికింది. రిటైల్ గా రూ.150 మాత్రమే పలికింది. ఈ సీజన్ దిగుబడి పెరిగి ఒకే సారి పంట మార్కెట్టుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు.

error: Content is protected !!