News December 22, 2024

బీసీ వసతి గృహ విద్యార్థి అదృశ్యం.. మంత్రి సవిత ఫైర్

image

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి బీసీ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న జగదీశ్ నాయక్ అదృశ్యం కావడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థిని వెతికి పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తనకల్లు మండలం రత్నా నాయక్ తండాకు చెందిన జగశ్ష్ నాయక్ శనివారం ఉదయం అదృశ్యమైనట్టు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల కదిలికపై కన్నేసి ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News January 4, 2025

మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్

image

అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో శుక్రవారం సాయంత్రం మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో 4వ రోజున ఈవెంట్స్ పారదర్శకంగా కొనసాగాయి. ప్రత్యేకంగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించి, అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు.

News January 3, 2025

ఈనెల 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు

image

పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌పై ఈ నెల 10 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

News January 3, 2025

తాడిపత్రిలో నటి మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు

image

తాడిపత్రిలో సినీ నటి మాధవీ లతపై రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, మహిళా కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ గౌస్ బాషాకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. గత నెల 31న జేసీ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీ లత తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.