News September 9, 2024
బుడమేరులా.. భద్రకాళి చెరువుతో పొంచి ఉన్న ముప్పు!
APలో విజయవాడను బుడమేరు వాగు వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అధికారులు పట్టించుకోకుంటే మన వరంగల్ నగరంలో భద్రకాళి చెరువుతోనూ పెద్ద ముప్పే ఉంది. గతంలో భద్రకాళి చెరువుకు గండి పడటంతో సమీపంలోని కాలనీ వాసులను ఖాళీ చేయించారు. హంటర్ రోడ్డు బొందివాగు పొంగితే వరద ధాటికి పోతన నగర్ వైపు మరోసారి గండి పడే ప్రమాదం ఉంది. స్మార్ట్ సిటీ పనుల్లో కట్టకు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తేనే సమస్య తొలుగుతుంది.
Similar News
News November 26, 2024
దుగ్గొండి: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
దుగ్గొండి మండలంలో గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన కాపరి కోట మల్లయ్య అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ భూమి వద్ద గొర్రెల మంద పెట్టాడు. సోమవారం రాత్రి అక్కడ ఉన్న తన కుమారుడికి ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మల్లయ్య మృతి చెందినట్లు చెప్పారు.
News November 26, 2024
వరంగల్‌లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT
News November 26, 2024
మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ కలెక్టర్
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ ఛార్జీలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మిల్లర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆ మిల్లులను భవిష్యత్‌లో ఎటువంటి వ్యాపారం చేయకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు.