News September 22, 2024

బూర్జ: శ్మశాన వాటికకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు

image

బూర్జ మండలం చీడివలస గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికకు సరైన రహదారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో ఎవరైనా మృత్యువాత పడితే దహన సంస్కారాలకు పంట పొలాల గట్లు మీద నుంచి నానా అవస్థలు పడుతూ తీసుకెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం అయినా రహదారి నిర్మించాలని కోరుతున్నారు.

Similar News

News October 13, 2024

SKLM: మద్యం సీసా గుచ్చుకొని యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. మెళియాపుట్టి మండలం మురికింటిభద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం తాగి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అప్పటికే మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో.. అవి పగిలిపోయాయి. సీసా పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 12, 2024

శ్రీకాకుళం: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?

image

దసరా పండుగ అనగానే పల్లె గుర్తుకొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. పల్లెల్లో తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.

News October 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

image

జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.