News March 25, 2025
బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

IPL బెట్టింగులపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షలో CP పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ అధికారులతో CP సమీక్ష జరిపారు.
Similar News
News March 29, 2025
KMM: ఫ్యాన్‌కు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక మసీదు రోడ్డుకు చెందిన షేక్ ఆలీబాబా అలియాస్ బన్ను(24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2025
ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: మంత్రి

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం V. వెంకటాయపాలెం గ్రామంలో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.
News March 29, 2025
ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలి: తుమ్మల

ఖమ్మం: కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్తంభాద్రి పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి, కమర్తపు మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదు రమేష్ తదితరులు పాల్గొన్నారు.