News April 1, 2025
బెట్టింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: BHPL ఎస్పీ

బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం అన్నారు. యువత, విద్యార్థులు, అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.
Similar News
News April 5, 2025
మహిళా కాలేజి వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా విశాఖ ప్రభుత్వ మహిళా కాలేజీ వసతి గృహంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేతుల మీదగా కేక్ కట్ చేశారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతిగృహంలో ఉన్న వసతుల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.
News April 5, 2025
మార్పు మనతోనే ప్రారంభించాలి: ఖమ్మం కలెక్టర్

మనం ఆశించే మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాలనే సూక్తిని బాబు జగ్జీవన్ రామ్ పాటించారని, తన కుమార్తెను ఉన్నత విద్య చదివించారని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. శనివారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.
News April 5, 2025
విజయవాడ: రద్దైన Dy.CM పవన్ భద్రాచలం పర్యటన

డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి భద్రాచలం పర్యటన రద్దయినట్లు విజయవాడలోని ఆయన కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున భద్రాద్రి రామయ్యకు శ్రీరామ నవమి సందర్భంగా పవన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తొలుత సమాచారం వెలువడింది. తాజాగా పర్యటన రద్దైనట్లు పవన్ కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ అధికారులకు సమాచారం అందచేసింది.