News April 5, 2025
బెల్లంపల్లి: BRS నాయకుడిపై క్రిమినల్ కేస్

సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో బెల్లంపల్లి MLAపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపైన కేసు నమోదు చేసినట్లు తాళ్లగురజాల SI రమేశ్ తెలిపారు. MLA సహకారంతో కొందరు కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందున్న ఖాళీ స్థలం కబ్జా చేస్తున్నారని అసత్య ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపతథ్యంలో BRS నాయకుడు నూనెటి సత్యనారాయణపైన క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
MBNR: ఎరుకల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

ఎరుకల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి ఎరుకల సంఘం సభ్యులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్సరి కృష్ణయ్య మాట్లాడుతూ.. పేద ఎరుకలకు విద్య, వైద్యం, సీసీ రోడ్లు, ఉపాధి, మౌలిక వసతులు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. పందుల పెంపకం దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గిరిజన రుణాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నారు.
News April 8, 2025
అన్నమయ్య, కడప జిల్లాలో న్యాయమూర్తుల బదిలీలు

అన్నమయ్య, కడప జిల్లాల్లో జడ్జిలను, అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారు ఏప్రిల్ 21 తేదీ లోపు చార్జ్ తీసుకోవాలని వివరించారు. శ్రీలతను ఖాళీగా ఉన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి 7 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎన్. శాంతిని కడప ఆరవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.
News April 8, 2025
నరసరావుపేట: ‘క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.60 లక్షలు కొట్టేశారు’

క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.60 లక్షలు కొట్టేశారని తమకు న్యాయం చేయాలని బాధితులు వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సతీశ్, శ్రీనివాసులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాగేశ్వర్, రవికుమార్‌లు ఆన్లైన్ నెట్వర్క్ పేరుతో అత్యధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. పెట్టుబడి పెట్టించి, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.