News April 3, 2025
బెల్లంపల్లి: ‘SC, ST కేసుల్లో జాప్యం చేయకూడదు’

కరీంనగర్ జిల్లాలో SC, STకమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా SC, ST రివ్యూ మీటింగ్‌లో సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. SC, STకేసు ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా రిజిస్టర్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో SC, STలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. SC, ST హాస్టల్ విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Similar News
News April 10, 2025
15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
News April 10, 2025
నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!

ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన తహవూర్ రాణాను నేడు భారత్‌కు తీసుకురానున్నారు. అమెరికా అధికారుల నుంచి అతడిని అదుపులోకి తీసుకున్న భారత అధికారులు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. అనంతరం NIA రాణాను తమదైన శైలిలో లోతుగా విచారించనుంది. 26/11 ముంబై దాడుల్లో 166 మందిని రాణా సహా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.
News April 10, 2025
సుస్థిర అభివృద్ధిలో బండపల్లికి రాష్ట్రంలో పదోర్యాంక్

చందుర్తి మండలం బండపల్లి గ్రామపంచాయతీ 80.41 మార్కులతో రాష్ట్రంలో అభివృద్ధిలో ఏ గ్రేడులో ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలలో మౌలిక వసతుల పెంపు కోసం, ప్రజల సౌకర్యాలు కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేసే బండపల్లి గ్రామం రాష్ట్రంలో 10వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.