News April 12, 2025
బెల్లంపల్లి: ఇంట్లో గంజాయి పెంపకం.. వ్యక్తి అరెస్ట్: SHO

ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SHO దేవయ్య తెలిపారు. బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన దేవి రాహుల్‌కు గంజాయి తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోతన ఇంటి ఆవరణలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. మొక్కలను స్వాధీనం చేసుకొని రాహుల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News April 19, 2025
వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.
News April 19, 2025
నిజామాబాద్: లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ: కలెక్టర్

జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ సాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, సంబంధిత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ జరుగుతుందని వివరించారు.
News April 19, 2025
AMP: ఒక్కరోజు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వైస్ ఛైర్మన్

అమలాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా వైస్ ఛైర్మన్ వెంకటేష్ శనివారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ చట్టప్రకారంగా ఛైర్మన్ సెలవు వెళ్తే వైస్ ఛైర్మన్‌గా పనిచే చేయవలసింది. దీనితో శనివారం వైస్ ఛైర్మన్ వెంకటేష్‌కు ఛైర్మన్‌గా అవకాశం లభించింది. దీనితో మున్సిపల్ ఛైర్మన్‌గా వెంకటేష్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. బాధ్యతలు చేపట్టిన వెంకటేష్‌ను ఎమ్మెల్సీ సూర్యనారాయణ సత్కరించారు.