News December 14, 2024
బెల్లంపల్లి: ఊయల మెడకు చుట్టుకొని మహిళ మృతి
కూతురును ఆడించేందుకు కట్టిన ఊయల తల్లి మెడకు చుట్టుకొని మహిళ మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 1టౌన్ SHO దేవయ్య వివరాల ప్రకారం.. బెల్లంపల్లిబస్తికి చెందిన నీరజ(42) తన కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం కూతురును ఒళ్లో కూర్చోపెట్టుకొని ఇద్దరు ఊయల ఊగుతూ ఆడించింది. కూతురును దించి కుమారుడికి ఊయల ఊగడం చూపిస్తుండగా ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News December 27, 2024
సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
News December 26, 2024
నిర్మల్ : ‘కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి’
కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్లు , టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.
News December 26, 2024
నిర్మల్: చెత్త కవర్లో శిశువు మృతదేహం లభ్యం
మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.