News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News March 10, 2025

అర్జీల ప‌రిష్కారంలో జిల్లాను అగ్ర‌స్థానంలో నిల‌పాలి: కలెక్టర్

image

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్ట‌మ్‌కు వ‌చ్చే అర్జీల ప‌రిష్కార నాణ్య‌త‌లో జిల్లాను అగ్ర‌స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం విజయవాడలోని క‌లెక్ట‌రేట్లో ఆయన అధికారులతో కలిసి ప్ర‌జ‌ల నుంచి 152 అర్జీలు స్వీక‌రించారు. అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి, స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేయాల‌న్నారు.

News March 10, 2025

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు రాష్ట్ర అప్పులు కావు: కేంద్రం

image

అమరావతి కోసం తీసుకున్న రుణాలు AP అప్పుల పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో YCP MP అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ‘ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణం వచ్చేలా సహాయం చేశాం. ఇవి రాష్ట్ర అప్పులు కావు. రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.2,500 కోట్లు సమకూర్చాం. కౌంటర్ పార్ట్ ఫండింగ్ ద్వారా గరిష్ఠంగా రూ.1500 కోట్లు సమకూర్చాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.

News March 10, 2025

సిరిసిల్ల: దరఖాస్తుల ఆహ్వానం: రాఘవేందర్ రావు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జోలి శాఖ సహాయ సంచాలకులు రాఘవేందర్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!