News February 19, 2025
బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి విద్యాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
Similar News
News December 18, 2025
అంకితభావం చాటిన అధికార యంత్రాంగం!

కామారెడ్డి జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎన్నికల విభాగాల సిబ్బంది కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
News December 18, 2025
రాజీ మార్గమే రాజ మార్గం: ఎస్పీ స్నేహ మెహ్ర

ఈనెల 21న నిర్వహించే జాతీయ మెగా లోక్-అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. క్షణికావేశంలో జరిగిన చిన్న తప్పులు, అనవసర వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్-అదాలత్ ఒక ఉత్తమ అవకాశం అని పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న అన్ని రకాల కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీ పడాలన్నారు.
News December 18, 2025
వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు సమర్పించి CBN స్కామ్‌ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.


