News February 8, 2025
బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి
బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.
Similar News
News February 8, 2025
HYD: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత
అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.
News February 8, 2025
గండిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం నార్సింగిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు స్వచ్ఛమైన రుచికరమైన ఆహారం అందించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News February 8, 2025
‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించట్లేదు: పౌరసరఫరాలశాఖ
TG: ‘మీసేవ’ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.