News April 14, 2025
బెల్లంపల్లిలో మహిళ అరెస్ట్

బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా దేశీదారు విక్రయిస్తున్న మహిళను ఆదివారం అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా కోట సారమ్మ వద్ద 9 లీటర్ల దేశీదారు మద్యం లభ్యమైందని పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News April 17, 2025
రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

TG: ఇటీవల బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహా రూ.500కు పైగా ధర ఉండే లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. దీని ప్రకారం బాటిల్‌పై మినిమమ్ రూ.50 పెరిగే అవకాశముంది. ఆయా బాటిళ్ల ఎమ్మార్పీ ఆధారంగా రేట్లు పెరగనున్నాయి. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News April 17, 2025
పలాయనం చిత్తగించిన కూటమి నేతలు: రోజా

AP: దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని ట్వీట్లు చేసిన కూటమి నేతలు ఫోన్ ఎత్తకుండా పలాయనం చిత్తగించారని వైసీపీ నేత రోజా ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ప్రూఫ్‌లతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్‌లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు.
News April 17, 2025
చికిత్సకు డబ్బులు వేస్ట్ అని రియల్టర్ సూసైడ్?

UPలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ రియల్టర్ తుపాకీతో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకున్నాడు. చికిత్సకు అనవసరంగా డబ్బు ఖర్చు చేసేందుకు ఇష్టం లేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్‌లో రాశారు. ఘజియాబాద్‌కు చెందిన కుల్దీప్ త్యాగి (46), అన్షు త్యాగి భార్యాభర్తలు. ఇటీవల కుల్దీప్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్సకు డబ్బులు వెచ్చించే బదులు మిగిలించడం మేలని భావించి ప్రాణాలు తీసుకున్నారు.