News March 10, 2025

బైంసా: 16 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు

image

గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన ఓపెన్ యూనివర్సిటీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కింద ముగ్గురు విద్యార్థులు బుక్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కేంద్రంలో ఇప్పటివరకు మొత్తం 16 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌లో పట్టుబడ్డట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

ఢిల్లీ కాలుష్యానికి వాహనాలూ ప్రధాన కారణం: సుప్రీంకోర్టు

image

ఢిల్లీలో గాలి కాలుష్యం సంక్షోభానికి వాహనాలు కూడా ప్రధాన కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిటీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరముందని పేర్కొంది. కాలుష్య స్థాయులను సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని కామెంట్లు చేసింది. ట్రాఫిక్ జామ్‌లపై NHAIకి నోటీసులు జారీ చేసింది.

News December 17, 2025

పెద్దపల్లి: పోలింగ్ సరళిని పర్యవేక్షించిన: డీసీపీ

image

పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా ఠాణాకు సమాచారం అందించారు. డీసీపీ అధికారులకు, పోలీసులకు సూచనలు ఇచ్చారు. సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతా బలగాలు మోహరించారని, గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలను నిర్వహించవద్దని ఆయన పేర్కొన్నారు.

News December 17, 2025

ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తాడిపత్రి మండల వాసి

image

తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.