News March 23, 2024
బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాయిన వాని కుంట స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయలైన వ్యక్తిని సాగర్ కమల నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. వారు నాగార్జున సాగర్‌కు వాసులుగా గుర్తించారు.
Similar News
News November 17, 2024
భువనగిరి: గ్రూప్-3 పరీక్ష.. యువతికి రోడ్డు ప్రమాదం
గ్రూప్ -3 పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతికి గాయాలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం చెందిన శృతి భువనగిరిలోని వెన్నెల కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తుండగా అనాజీపురం వద్ద వారి బైక్‌పై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకుని తిరిగి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా సమయం ముగియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెను తిరిగింది.
News November 17, 2024
NLG: సాగు అంచనా @5,83,620 ఎకరాలు!
జిల్లాలో రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 5,83,620 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అందులో వరి 5,56,920 ఎకరాలు, సజ్జ 150, జొన్న 2,200, వేరుశనగ 21,000, పెసర 2,000, ఆముదం 350, మినుములు 1,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది.
News November 17, 2024
NLG: ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ రిలీజ్
నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం అధికారి పోస్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను www.nalgonda.telangana.gov.in వెబ్సైట్లో ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రకటించారని డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే సోమవారం మధ్యాహ్నం లోగా లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు.