News May 12, 2024
బొంరస్‌పేట్: గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి
కొడంగల్ నియోజకవర్గం బొంరస్‌పేట్ మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పరి వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందాడు. 30 ఏళ్లుగా ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న వెంకటయ్య మరణం పత్రికా రంగానికి తీరని లోటుని టియుడబ్ల్యుజే(ఐజేయు) సంఘం రాష్ట్ర నాయకులు శ్రీకిషన్ రావు అన్నారు. వెంకటయ్య మృతి బాధాకరమని, మీడియా రంగంలో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2025
అధైర్య పడవద్దు.. అందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్
ఎవరు అధైర్య పడకూడదని అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ధరూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రణాళిక ప్రకారం గ్రామసభలు నిర్వహించి, అర్హులకు పథకాలు వర్తింప చేస్తామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
News January 21, 2025
MBNR : ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకొని మహిళ మృతి
మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఓ మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కందేన్‌పల్లికి చెందిన నారమ్మ (32) తీవ్ర అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 21, 2025
ఐజ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బింగి దొడ్డికి చెందిన వీరాంజనేయులు తన పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి బైక్‌పై ఐజాకి వెళ్లి వస్తున్నాడు. తిమ్మప్ప ఆలయం దగ్గర అతడి బైక్‌ను మరొక బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.