News February 10, 2025

బొబ్బిల్లంక: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సీతానగరం మండలం చిన్నకొండేపూడి చెందిన దంతె ప్రసాద్ (24) బొబ్బిలంక వద్ద ప్రమాదవశాత్తు ట్రాలీ వెనుక చక్రంలో పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తు బొబ్బిల్లంక వద్ద ట్రాలీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News February 11, 2025

RJY: జిల్లాలో 94.8 శాతం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

image

తూ.గో జిల్లాలో 4,30,339 పిల్లలకు గాను 4,07,961 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపణీ 94.8శాతం మేర పూర్తి చేశామని కలెక్టర్ ప్రశాంతి సోమవారం సాయంత్రం తెలిపారు. 17వ తేదీన మరో దఫా అందిస్తామన్నారు. పిల్లలో రక్తహీనత నిర్మూలనే లక్ష్యంగా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను విద్యార్థులచే మింగిస్తుందని తెలిపారు. 

News February 10, 2025

రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

image

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

News February 10, 2025

అనపర్తిలో పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

image

అనపర్తిలో ఓ యువకుడు పెళ్లైన ఏడాదికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI శ్రీను తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి సాకేత్‌రెడ్డి కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. శనివారం పురుగుమందు తాగగా.. బంధువులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

error: Content is protected !!