News February 15, 2025

బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

image

బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్‌ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ రవూఫ్‌పై విజయం సాధించారు.

Similar News

News March 14, 2025

బిక్కనూర్: రేపటి నుంచి సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

image

బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని ఉన్న దక్షిణ కాశీగా, పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 

News March 14, 2025

కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు. 

News March 14, 2025

ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

image

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.

error: Content is protected !!