News February 25, 2025
బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శిని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటిపన్ను రశీదులు ఆన్లైన్ చేయకుండా తప్పుదోవ పట్టించారనే విషయమై విచారణ అనంతరం చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 14, 2025
హైదరాబాద్‌లో మెస్సీ.. PHOTO GALLERY

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.
News December 14, 2025
రేపు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సెలవు: సిద్దిపేట కలెక్టర్

రెండో విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ సెలవు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని అక్బర్‌పేట్-భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10 మండలాల్లోని గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు.
News December 14, 2025
పాలకుర్తి: సర్పంచ్ అభ్యర్థిపై కత్తిపోట్లు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న జనగామ మనోజ్ కుమార్ ను శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. తెల్లారితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనోజ్ కుమార్‌పై హత్యాయత్నం జరగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సివుంది.


